త్వరలో నయన్-శివన్‌ల పెళ్లి వేడుక..

by Shyam |
త్వరలో నయన్-శివన్‌ల పెళ్లి వేడుక..
X

డైరెక్టర్ విఘ్నేశ్ శివన్, లేడీ సూపర్‌స్టార్ నయనతారలు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా లవ్ జర్నీని ఎంజాయ్ చేస్తున్న ఈ ప్రేమ పక్షులు.. ఇక పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని కోలీవుడ్ టాక్. జూన్ 8 నుంచి ఆలయాలు తెరుచుకోనుండగా.. చాలా కొద్ది మంది కుటుంబ సభ్యుల నడుమ వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటవబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తుండగా..ఈ క్రేజీయెస్ట్ లవ్ బర్డ్స్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు అటు నయన్‌గానీ, విఘ్నేశ్‌గానీ స్పందించలేదు.

‘నేనూ రౌడీనే’ సినిమా సమయంలో దగ్గరైన నయన్, శివన్.. ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియాలో ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంటారు. మదర్స్ డే రోజు ‘నా పిల్లలకు కాబోయే తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు’ అని తెలిపిన శివన్.. నయన్ ఒక బిడ్డను ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు వీరిద్దరి పెళ్లిపై వస్తున్న రూమర్లు రూమర్లుగానే మిగిలిపోతాయా.. నిజంగా నయన్, శివన్‌లను ఏకం చేస్తాయా చూడాలి.

Advertisement

Next Story

Most Viewed