బర్త్ డే రోజు నవీన్ పొలిశెట్టి.. అనుష్క శెట్టితో కలిసి..

by Shyam |
Naveen polisetty
X

దిశ, సినిమా: శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో వెలుగులోకి వచ్చిన నవీన్ పొలిశెట్టి.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో తొలి బ్రేక్ అందుకున్నాడు. తర్వాత ఇటీవల వచ్చిన ‘జాతిరత్నాలు’ మూవీ సక్సెస్‌తో పెద్ద స్టార్‌గా ఎదిగిపోయిన ఈ యంగ్ హీరో.. తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తన తర్వాతి ప్రాజెక్ట్ ఉండబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

‘ఆఫీస్‌లో రూటర్ ఫిక్స్ చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నా తదుపరి చిత్రాన్ని ప్రకటించినందుకు చాలా సంతోషిస్తున్నాను. పీ మహేష్ దర్శకత్వంలో.. నా ఫేవరెట్ నటుల్లో ఒకరైన అనుష్క శెట్టితో కలిసి పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు’ అంటూ ఫేస్ బుక్‌లో రాసుకొచ్చాడు. అలాగే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన యూవీ క్రియేషన్స్ సంస్థ ‘జన్మదిన శుభాకాంక్షలు నవీన్ పొలిశెట్టి. ప్రొడక్షన్ నెం14 కోసం మేము నీతో చేతులు కలపడం సంతోషంగా ఉంది’ అంటూ షేర్ చేసింది.

Advertisement

Next Story