సితారతోనే ‘జాతిరత్నం’ నెక్స్ట్ ప్రాజెక్ట్?

by Shyam |
Naveen Polishetty
X

దిశ, సినిమా: ‘జాతిరత్నాలు’ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తర్వాత అనుష్క శెట్టితో సినిమా చేస్తాడని అనుకున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రానున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉంటుందనుకున్నా.. ఆ ప్రాజెక్ట్ కాస్తా పక్కకు పెట్టేసినట్లు సమాచారం. దీంతో ఈ యంగ్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుందని టాక్. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కాబోతుండగా… సింగిల్ సిట్టింగ్‌లోనే మూవీకి ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై నిర్మాత నాగవంశీ త్వరలో అఫిషియల్ అనౌన్స్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.

Advertisement

Next Story

Most Viewed