- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలగించిన నవతెలంగాణ ఉద్యోగులకు ఒక నెల వేతనం..!
దిశ, హైదరాబాద్ :
‘నవతెలంగాణ లాకౌట్’ పేరుతో దిశ పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన యాజమాన్యం తన వెబ్ సైట్ లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది కొందరి దుష్రచారంగా తెలిపింది. గత మూడేళ్లుగా పత్రిక ఆర్థిక నష్టాలు, కష్టాల్లో ఉన్న విషయాన్ని ఒప్పుకుంది. ఈ క్రమంలోనే సంస్థలో కొన్ని పొదుపు చర్యలు తీసుకుంటున్న విషయాన్ని అంగీకరించింది. కానీ, అవి ఎలాంటి పొదుపు చర్యలో మాత్రం వివరించలేదు. ప్రజల ఆదరణ చూరగొని వారి ఆదరాభిమానాలతో పాటు సిబ్బంది అంకితభావంతో ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. పత్రిక చిరకాలం ప్రజలతోనే ఉండేందుకు, వారి సమస్యలపై పోరాడేందుకు ఈ చర్యలు అనివార్యమయ్యాయని ఆ వివరణలో తెలిపింది. ఇదే క్రమంలో నవతెలంగాణ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజాగొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తూ… ప్రజలకు, పాఠకులకు దూరం చేసేందుకు కుట్రపన్నుతున్నట్టు తెలిపింది. నవతెలంగాణ దినపత్రిక ఎప్పటికీ, ఎన్నటికీ ప్రజల మధ్యనే ఉంటుందని చెప్పింది. నవతెలంగాణ పత్రికను మూసివేస్తున్నట్టు వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది.
ఇదిలా ఉండగా, శనివారం జరిగిన సబ్ కమిటీ సమావేశంలో ఇప్పటి వరకూ తొలగించిన వారికి ఒక నెల (మార్చి) వేతనాన్ని చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించినట్టుగా విశ్వసనీయ సమాచారం.