- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా చేతుల్లో ఏం లేదు.. మణిపూర్ రాజకీయ సంక్షోభంపై సీఎం వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ లో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ, దానిమిత్రపక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకులు నాయకత్వ మార్పుపై హైకమాండ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మణిపూర్ సీఎ పరదవికి బీరెన్ సింగ్ రాజీనామా తప్పదనే ప్రచారం జరుగుతోంది. అయితే.. మణిపూర్ నాయకత్వ మార్పు ప్రచారంపై బీరెన్ సింగ్ స్పందించారు. మణిపూర్ లోని సమస్యను పరిష్కరించడంపైనే తన దృష్టి ఉందని ఆయన పేర్కొన్నారు. "ముఖ్యమంత్రిగా కొనసాగడం లేదా రాజీనామా చేయడం నా చేతుల్లో లేదు" అని జాతీయ మీడియాతో మాట్లాడారు.
కుకీల డిమాండ్ నెరవేర్చబోం
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువేమీ కాదని.. అనుకున్నది సాధించామని అన్నారు. గతసారి కంటే ఈసారి ఎక్కువ ఓట్లు వచ్చినా తిరుగుబాటు పరిస్థితుల వల్ల ఓడిపోయామని తెలిపారు. మణిపూర్ 2వేల ఏళ్ల పురాతనమైన ప్రాంతమని.. ఇప్పుడు భారత్ గర్వించదగిన రాష్ట్రమని తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం కావాలన్న కుకీల డిమాండ్ ని నెరవేర్చబోయేది లేదన్నారు. 16 జిల్లాల్లో కేవలం 2 నుంచి 3 జిల్లాల్లోనే గందరగోళం ఉందన్నారు. సంక్షోభం అంత పెద్దది కాదని.. ప్రజా అశాంతి ఉందని అన్నారు. పాఠశాలలు, వ్యాపారాలు అన్నీ సజావుగా జరుగుతున్నాయని గర్వంగా చెప్పగలను అని పేర్కొన్నారు. మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తొలిప్రాధాన్యత జాబితాలో మణిపూర్ సమస్య ఉందన్నారు.