ఫిట్‌నెస్ రహస్యాలు వెల్లడించిన సీజేఐ

by S Gopi |
ఫిట్‌నెస్ రహస్యాలు వెల్లడించిన సీజేఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తన ఫిట్‌నెట్ రహస్యాలను వెల్లడించారు. తెల్లవారుజామున 3:30 గంటలకు యోగా చేయడం, శాకాహారం తీసుకుంటున్నానని సీజేఐ తెలిపారు. ఇదే సమయంలో తోటి న్యాయమూర్తులకు వారు ఎదుర్కొంటున్న పని ఒత్తిడిని అధిగమించడానికి తాను అనుసరించాలని ప్రయత్నిస్తున్న జీవనశైలిని సిఫార్సు చేశారు. గురువారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయుష్ వెల్‌నెస్ హాలిస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన సీజేఐ, ఈ అలవాట్లు న్యాయమూర్తులు, వారి కుటుంబాలకే కాకుండా మొత్తం సుప్రీంకోర్టు సిబ్బందికి శ్రేయస్సుకు కూడా మంచిదన్నారు. సుప్రీంకోర్టులో 2,000 మంది సిబ్బంది ఉన్నారు. 34 మంది న్యాయమూర్తులు తమ రోజువారీ పనిలో విపరీతమైన ఒత్తిడిని కలిగి ఉంటారు, వారంతా విపరీతమైన పనిభారాన్ని మోస్తూ ఉంటారు. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు అందరూ సరైన జీవనశైలిని కలిగి ఉండాలని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభమైన ఆయుష్ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ ప్రత్యేకంగా న్యాయమూర్తులు, వారి కుటుంబాలు, సుప్రీంకోర్టు సిబ్బంది కోసం మెరుగైన సేవలు లభిస్తాయన్నారు.

Advertisement

Next Story