ప్రజల డబ్బుతోనే నామినేషన్.. కర్ణాటకలో ఆసక్తికర ఘటన (వీడియో)

by Javid Pasha |
ప్రజల డబ్బుతోనే నామినేషన్.. కర్ణాటకలో ఆసక్తికర ఘటన (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ వింత సన్నివేశాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ఓ మంత్రి.. తాను తొమ్మిదవ తరగతి చదివానని, తనకు రూ.1609 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించిన విషయం వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ స్వతంత్ర అభ్యర్థికి సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. యాద్గిర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి యంకప్ప నామినేషన్ ఫైల్ చేసేందుకు సిద్ధమయ్యారు. అంతకంటే ముందు తన డిపాజిట్ సొమ్ము రూ.10 వేలను చెల్లించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అతను కేవలం రూపాయి నాణేలతోనే రూ.10 వేలను డిపాజిట్‌గా చెల్లించారు.

అందులోను ఆ 10వేల రూపాయలు.. ప్రజలు ఒక్కో రూపాయి ఇచ్చినట్లు తెలిపారు. వాటితోనే తాను నామినేషన్ వేసేందుకు వెళ్లగా.. వాటిని లెక్కించేందుకు 3 గంటల సమయం పట్టింది. నాణేలు లెక్కించిన తర్వాత యంకప్ప నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం యంకప్ప మాట్లాడుతూ.. ‘నా సామాజికవర్గం, గ్రామస్థులకు నా జీవితాన్ని అంకితం చేస్తాను. స్వామి వివేకానంద సిద్ధాంతాల పోస్టర్లుతో రిటర్నింగ్‌ అధికారి వద్దకు వచ్చాను’ అని చెప్పారు.

Advertisement

Next Story