భారత్‌లో 2లక్షల అకౌంట్లపై నిషేధం.. ఎందుకో తెలుసా?

by Swamyn |
భారత్‌లో 2లక్షల అకౌంట్లపై నిషేధం.. ఎందుకో తెలుసా?
X

దిశ, నేషనల్ బ్యూరో: నిబంధనలు ఉల్లంఘిస్తున్న యూజర్ల అకౌంట్లపై ఎలన్ మస్క్‌కు చెందిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విట్టర్) ఉక్కుపాదం మోపుతోంది. చిన్నారులకు సంబంధించిన అశ్లీలం, ఏకాభిప్రాయం లేని నగ్నత్వ కంటెంట్‌ను పోస్టు చేసే ఖాతాలపై నిషేధం విధించింది. నెల వ్యవధిలోనే భారత్‌లో 212,627 అకౌంట్లను సస్పెండ్ చేసినట్టు ‘ఎక్స్’ వెల్లడించింది. ఇవేకాకుండా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మరో 1,235 ఖాతాలపైనా వేటేసినట్టు పేర్కొంది. ఈ మేరకు పిల్లలపై అశ్లీలం, ఉగ్రవాద కంటెంట్‌ నియంత్రణకు సంబంధించి అనేక చర్యలను అమలు చేసినట్లు ఎక్స్‌ సోమవారం తన నెలవారీ నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో భారత్‌లోని వినియోగదారుల నుంచి 5,158 ఫిర్యాదులు అందినట్టు తెలపగా, మెజార్టీ కంప్లయింట్స్‌ను పరిష్కరించినట్టు వెల్లడించింది.


Advertisement

Next Story