- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అదానీ, మోడీ మీడియా ఏం రాసుకుంటారో రాసుకోండి'.. సొంత ఇలాకాలో రాహుల్ గాంధీ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో:కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం అని.. జూన్ 4వ తేదీ దేశవ్యాప్తంగా ఉన్న పేద రైతుల రుణాలను మాఫీ చేయబోతున్నామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన యూపీయే ప్రభుత్వం రైతుల రుణాలను మాపీ చేసినట్లుగా మరోసారి రైతుల రుణాలను మాఫీ చేయబోతున్నామని ఈ విషయంలో అదానీ మీడియా, మోడీ మీడియా ఏం రాసుకుంటారో రాసుకోండి.. ఎవరికీ భయపడేది లేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ అదానీ, అంబానీ మీడియా కేవలం మోడీ ఫోటోలను మాత్రమే చూపిస్తోందని, రైతులు, కార్మికులు, పేదలకు చెందిన మీడియా కాదని ధ్వజమెత్తారు. మీరు మోడీ ఫోటోలు ఎన్ని చూయించుకుంటారో చూయించుకోండి మాకేం ఫరక్ పడదు. మేం చేయాలనుకుంటున్నామో తప్పక చేసిచూపుతామన్నారు.
జీఎస్టీ రద్దు చేస్తాం:
మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలను లక్షాధికారులను చేయబోతున్నామని పేద మహిళల ఖాతాల్లో నెలకు రూ.8500 చొప్పున ఏడాదికి రూ. లక్ష జమచేయబోతున్నామని ఈ స్కీమ్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా మోడీ ప్రభుత్వం చిన్న వ్యాపారులను దారుణంగా దెబ్బతీసిందని తాము అధికారంలోకి రాగానే జీఎస్టీ తొలగించి ఒకే పన్ను విధానం తీసుకు వస్తామని, వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు డోర్లు తెరుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలన్ని ప్రైవేటీకరణ చేస్తూ అదానీ, అంబానీలకు సర్కార్ భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అగ్నీవీర్ స్కీమ్ ను తాము రద్దు చేస్తామని చెప్పారు.