US Election: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ ఆర్థికవేత్త సంచలన జోస్యం

by S Gopi |   ( Updated:2024-10-29 17:13:13.0  )
US Election: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ ఆర్థికవేత్త సంచలన జోస్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే నెలలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలాహారిస్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన ఆర్థికవేత్తగా పేరున్న క్రిస్టోఫె బరాడ్ అమెరికా ఎన్నికలపై జోస్యం చెప్పారు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయమని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. బెట్టింగ్ మార్కెట్లు, పోల్స్, ఎన్నికల మోడల్స్, ఫైనాన్షియల్ మార్కెట్ల కొలమానాలను పరిశీలిస్తే ట్రంప్ విజయం ఖచ్చితమనే సూచనలు కనిపిస్తున్నాయని తేల్చి చెప్పారు. మార్కెట్ సెక్యూరిటీస్ మొనాకోలో చీఫ్ ఎకనమిస్ట్, స్ట్రాటజిస్ట్‌గా ఉన్న బరాడ్ గడిచిన 12 ఏళ్లలో 11 ర్యాంకింగ్స్‌లో బ్లూమ్‌బర్గ్ ఆర్థిక అంచనాల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. 38 ఏళ్లకే సరైన అంచనాలతో విజయవంతమైన ట్రాక్ రికార్డులను క్రిస్టొఫె బరాడ్ సొంతం చేసుకున్నారు.

Advertisement

Next Story