అయోధ్య రాముడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద తాళం.. 1,265 కిలోల లడ్డూ ప్రసాదం

by Shamantha N |   ( Updated:2024-01-20 15:52:26.0  )
అయోధ్య రాముడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద తాళం.. 1,265 కిలోల లడ్డూ ప్రసాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద తాళం, వెయ్యి కిలోల లడ్డూ ప్రసాదం అయోధ్యకు చేరుకుంది. 400 కిలోల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద తాళం, వెయ్యి 265 కిలోల లడ్డూ ప్రసాదం అయోధ్య ఆలయానికి చేరింది.

అలీఘర్‌లోని నోరంగాబాద్‌ వాసి సత్య ప్రకాష్‌ శర్మ, అతని భార్య రుక్మిణి శర్మ రెండేళ్ల క్రితం తాళం నిర్మాణం చేపట్టారు. సత్య ప్రకాష్ శర్మ ఇటీవల మరణించారు. ఈ తాళాన్ని అయోధ్య రామమందిరానికి బహుమతిగా ఇవ్వాలనేది ఆయన కోరిక. నోరంగాబాద్ వాసి మహామండలేశ్వర్ అన్నపూర్ణ భారతి పూరి తాళంతో అయోధ్యకు బయల్దేరారు. క్రేన్ ద్వారా 400 కిలోల తాళాన్ని ఆలయానికి తరలించారు. తాళాన్ని చూసి జనాలు గుమిగూడి జైశ్రీరామ్ అని నినాదాలు చేశారు. సత్యప్రకాష్ శర్మ చనిపోయాక పగలు, రాత్రి కష్టపడి తాళం పూర్తి చేశామన్నారు మహామండలేశ్వర్ అన్నపూర్ణ భారతి పూరి.

హైదరాబాద్‌లోని శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి 1,265 కిలోల లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారు. దేవుడి దయ వల్ల తన వ్యాపారం బాగా నడుస్తుందని.. తను జీవించి ఉన్నంత కాలం ప్రతిరోజూ కిలో లడ్డూని సిద్ధం చేస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు నాగభూషణం రెడ్డి. లడ్డూ ప్రసాదం నెల వరకు ఉంటుందని.. 25 మంది 3 రోజులు కష్టపడి లడ్డూ తయారు చేసినట్లు తెలిపారు. ఫుడ్ సర్టిఫికేట్ కూడా తీసుకువచ్చినట్లు నాగభూషణం రెడ్డి. ఈ నెల 22న రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ పూజలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed