4B Revenge : ట్రంప్‌పై కోపం.. పురుషులపై ‘4బీ రివేంజ్’

by Hajipasha |
4B Revenge : ట్రంప్‌పై కోపం.. పురుషులపై ‘4బీ రివేంజ్’
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘4బీ రివేంజ్’ అనే టాపిక్ ఇప్పుడు అమెరికాలో ట్రెండ్ అవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్(Trump) గెలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కొందరు మహిళలు, యువతులు(US Women) ‘4బీ రివేంజ్’ హెచ్చరికలు చేస్తూ నిరసనకు దిగుతున్నారు. అమెరికాలోని పురుషుల వల్లే ఎన్నికల్లో ట్రంప్ గెలిచారని వారు ఆరోపిస్తున్నారు. ట్రంప్‌ను గెలిపించినందుకు పురుషులపై ‘4బీ రివేంజ్’ తీర్చుకుంటామని వార్నింగ్స్ ఇస్తున్నారు. ‘4బీ రివేంజ్’(4B Revenge) పేరుతో ప్రపంచంలోనే తొలిసారిగా దక్షిణ కొరియాలో మహిళలు నిరసనలు చేశారు.

కొరియన్ భాషలో ‘బీ’ అంటే ‘నో’ అని అర్థం. 4బీ అంటే.. నాలుగు ‘నో’లు అనే మీనింగ్ వస్తుంది. జీవిత భాగస్వామితో సెక్స్‌లో పాల్గొనకపోవడం, రిలేషన్ షిప్‌ను ఆపేయడం, పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం, సంతానాన్ని కనకపోవడం అనే నాలుగు అంశాలు ‘4బీ రివేంజ్’లో భాగంగా ఉంటాయి. ఇవన్నీ చేయకుండా పురుషుడిని ఇబ్బందిపెడతామని సదరు అమెరికన్ యువతులు, మహిళలు అంటున్నారు. తమ నిరసనల్లో భాగంగా ఇవే అంశాలను ప్లకార్డులపై రాసి ప్రదర్శిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed