- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోడ్డుపై మహిళ రీల్స్.. గొలుసు లాగి చైన్ స్నాచర్ పరార్!
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో లైక్స్, పాపులర్ అవ్వడం కోసం కొందరూ వెరైటీ వీడియోలు చేస్తుంటారు. మరికొంత మంది రోడ్లపైకి వచ్చి ‘రీల్స్’ షూట్ చేసే సమయంలో ట్రాఫిక్‌లో ఇతరులకు సమస్యగా మారుతుంటారు. వారు కూడా ప్రమాదాలకు గురవుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డు పక్కన ఒక మహిళ సెల్‌ఫోన్‌లో రీల్ షూట్ చేసుకుంటుంది. ఆమె నెమ్మదిగా కెమెరా వైపు వస్తుండగా, ఓ బైక్ రైడర్ వచ్చి మహిళ మెడలోని గొలుసు లాక్కొని పారిపోయాడు. ఆ మహిళ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి భయాందోళనకు గురవుతుంది. కానీ రీల్స్‌లో భాగంగానే అలా చేశారని పలువురు నెటిజన్లు ఈ ఘటనపై అభిప్రాయపడ్డారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగినట్లు తెలిసింది. ఈ వీడియోను స్థానిక పోలీసులకు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేశారు. ఒక వేలా నిజంగానే చైన్ స్నాచింగ్ జరిగితే ఆ బైక్ రైడర్‌ను పట్టుకోవాలని, లేదంటే ఆ రీల్స్ చేసిన ఫ్యామిలీ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు నెటిజన్లు ఫిర్యాదు చేశారు.