- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CAG on Viksit Bharat: వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి
దిశ, నేషనల్ బ్యూరో: వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవాలంటే దేశంలోని గ్రామాలు అభివృద్ధి చెందాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరర్(CAG) గిరీశ్ చంద్ర ముర్ము అన్నారు. వికసిత్ భారత్ కావాలంటే గ్రామీణ భారతం కీలకం అని అన్నారు. అధికార వికేంద్రకరణ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదని, గ్రామ సభలు, స్థానిక సంస్థలకు ఇంకా తగిన గుర్తింపు రావట్లేదన్నారు. ‘‘క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగకుండా.. వికసిత్ బారత్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. దేశంలోని 50 శాతం జనాభా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. ప్రభుత్వ పాలన, వారి అభివృద్ధి, పాలనాధికారాలు, తగిన వనరులు అందించకుండా.. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం అందుకోవడం అసాధ్యం. ప్రధాని చెప్పినట్లు ఒక్కొక్కరూ ఒక్కో అడుగు వేస్తే 140 కోట్ల అడుగులు అవుతాయి. అందుకే ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం’’ అని గిరీశ్ చంద్ర ముర్ము అన్నారు.
దేశంలో 2.6 లక్షల పంచాయతీలు
దేశంలో 2.6 లక్షల పంచాయతీలు, 7 వేల స్థానిక సంస్థలు ఉన్నాయని గిరీశ్ చంద్ర మర్ము అన్నారు. స్థానిక సంస్థలను సమర్థంగా మార్చి.. ప్రభుత్వ పథకాలు అందేలా చూడడం అనేది దేశానికి చాలా కీలకం అని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థలకు వెళ్లే నిధుల విషయంలో అకౌంటింగ్, ఆడిటింగ్‌ది కీలకపాత్ర అని తెలిపారు. కాబట్టి సరైన అకౌంటింగ్ విధానాలను పాటించని మున్సిపల్ కార్పొరేషన్‌లకు నిధులు ఇవ్వొద్దని సూచించారు. స్థానిక సంస్థలు సరైన అకౌంటింగ్, ఆడిట్ విధానాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.