- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దమ్ముంటే.. ‘మోడీ కీ గ్యారంటీ’లో అవి కూడా చేర్చండి : సీఎం
దిశ, నేషనల్ బ్యూరో : ‘మోడీ కీ గ్యారంటీ’పై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి దమ్ముంటే ఎన్నికల్లో గెలవగానే ఎలక్టోరల్ బాండ్లపై విచారణ, చైనా ఆక్రమించిన ప్రాంతాలను వెనక్కి తీసుకోవడం, కుల గణన నిర్వహించడం వంటి వాటిపై గ్యారంటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పౌరసత్వ చట్టానికి నోటిఫై చేసిన సవరణలను వెనక్కి తీసుకోవడంతో పాటు విపత్తు సహాయ నిధులను తక్షణమే పంపిణీ చేయాలన్నారు. ఈమేరకు వివరాలతో ‘మోడీ కీ గ్యారంటీ’ ట్యాగ్‌పై స్టాలిన్ తమిళ భాషలో బుధవారం ఓ ట్వీట్ చేశారు. వలస పక్షులు సీజనల్‌గా వివిధ ప్రాంతాలకు ఎలాగైతే వెళ్లొస్తాయో.. అదేవిధంగా ప్రధాని మోడీ ఎన్నికల టైంలో తమిళనాడుకు వచ్చి వెళ్తుంటారని చెప్పారు. హామీ కార్డుతో తమిళనాడుకు వస్తున్న ప్రధాని.. తాను చెబుతున్న విధంగా దేశ ప్రజలకు గ్యారంటీలను ఇవ్వగలుగుతారా అని ప్రశ్నించారు. ‘‘నేను కోరిన విధంగా మోడీ గ్యారంటీలను ఇవ్వాలి. ఒకవేళ అలా చేయలేకపోతే.. కేవలం కాషాయ రంగు దుస్తుల మురికిని వదిలించే వాషింగ్ మెషీన్‌లా బీజేపీ మారిపోయిందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది’’ అని తమిళనాడు సీఎం చెప్పారు.