- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌దే విజయం: మల్లికార్జున ఖర్గె!
కలబుర్గి: వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె ఓ ప్రకటనలో అన్నారు. అలాగే, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత ఉందన్నారు. బుధవారం కర్ణాటకలోని తన సొంత జిల్లా కలబుర్గి పర్యటనలో భాగంగా మాట్లాడిన ఖర్గే, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు మెరుగైన పాలనను అందిస్తున్నాయని, ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు సమస్యలేమీ లేవన్నారు.
ఈ నేపథ్యంలో 'ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. మేము అన్ని రాష్ట్రాల్లో గెలుస్తామనే విశ్వాసం ఉంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం కారణంగా బీజేపీకి అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉందని' ఖర్గె వివరించారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ బీజేపీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్ని వాగ్దానాలు చేసినా బీజేపీ నిలబెట్టుకోలేదు. నిరుద్యోగం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటి అంశాల్లో పూర్తిగా విఫలమైందని ఖర్గె పేర్కొన్నారు.