- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశాన్ని విక్షిత్ భారత్ గా తీర్చిదిద్దే బడ్జెట్ ఇది- ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: నిర్మలాసీతారామన్ సమర్పించిన మధ్యంతర బడ్జెట్ ను ప్రశంసలతో ముంచెత్తారు ప్రధాని మోడీ. బడ్జెట్ ఓ ఆవిష్కరణ అని అభివర్ణించారు. విక్షిత్ భారత్ నాలుగు స్తంభాలను బడ్జెట్ మరింత శక్తివంతం చేస్తుందన్నారు.
మధ్యంతర బడ్జెట్ వినూత్నమైనదని.. దీని కొనసాగింపుపై విశ్వాసం కలిగి ఉన్నామన్నారు ప్రధాని మోడీ. విక్షిత్ భారత్ లోని నాలుగు మూలస్తంభాలైన.. యువత, పేదలు, మహిళలు, రైతులకు శక్తినిస్తుందన్నారు. ఈ బడ్జెట్ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే హామీని ఇస్తుందన్నారు. భారత యువత ఆకాంక్షలు బడ్జెట్ లో ప్రతిబింబిస్తున్నాయన్నారు. బడ్జెట్ లో రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని.. పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.లక్షకోట్ల నిధిని ప్రకటించారన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు సాధికారత కల్పించడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసిందన్నారు. పేదలకు మరో 2 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. 3 కోట్లమంది లక్ పతి దీదీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు. ఆశా, అంగన్వాడీ వర్కర్లు కూడా ఆయుష్మాన్ భారత్ ప్రయోజనం పొందుతారని స్పష్టం చేశారు.