- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్భాన్ని తొలగించుకున్న భార్య.. క్రూరత్వమంటూ భర్త పిటిషన్.. తీర్పు ఇదీ
దిశ, నేషనల్ బ్యూరో : గర్భాశయ క్యాన్సర్‌తో భార్య గర్భాశయాన్ని తొలగించుకుంటే.. దాన్ని మానసిక క్రూరత్వంగా పరిగణించి తమ వివాహాన్ని రద్దు చేయాలని ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. అనారోగ్య పరిస్థితుల ప్రభావంతో అత్యవసర వైద్యంలో భాగంగా మహిళ గర్భాశయాన్ని తొలగించుకోవడం ఆమె మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టులోని మదురై బెంచ్ స్పష్టం చేసింది. ఈ అంశంపై తొలుత పిటిషనర్ తన భార్యకు వ్యతిరేకంగా స్థానిక ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశాడు. ఆరోగ్య విషయాలను భార్య తన నుంచి దాచిందని ఆరోపించాడు. గర్భాశయాన్ని తొలగించుకొని సంతానం పొందలేని స్థితికి తన భార్య చేరుకుందని, ఇది క్రూరమైన చర్య అని కోర్టులో భర్త వాదనలు వినిపించాడు.
ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్నే సమర్ధించిన హైకోర్టు
అయితే పెళ్లి తర్వాతే సదరు మహిళకు క్యాన్సర్ నిర్ధారణ అయిందని విచారణలో తేలింది. ఆరోగ్య అత్యవసర స్థితిలో భార్య గర్భాశయాన్ని తొలగించుకోవడం అనేది భర్తపై క్రూరత్వం చూపినట్లు కానే కాదని పేర్కొన్న ఫ్యామిలీ కోర్టు.. భర్త పిటిషన్‌ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అతడు మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేయగా.. ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్నే మదురై బెంచ్‌లోని న్యాయమూర్తులు సమర్ధించారు. ఆరోగ్య సమస్యలతో భార్య గర్భాశయాన్ని తొలగించుకోవాల్సి రావడం విధి రాత తప్ప మరొకటి కాదని భర్తకు ధర్మాసనం హితవు పలికింది.