- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముఖ్తార్ అన్సారీ చావువార్త విని పండుగ చేసుకున్నాం : అల్కా రాయ్
దిశ, నేషనల్ బ్యూరో : గ్యాంగ్‌స్టర్, రాజకీయ వేత్త ముఖ్తార్ అన్సారీ ఉత్తరప్రదేశ్‌లోని బందా జైలులో చికిత్స పొందుతూ గురువారం గుండెపోటుతో మరణించారు. దీనిపై దివంగత బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్ సతీమణి అల్కా రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్తార్ అన్సారీ మరణంతో తమకు న్యాయం జరిగిందని ఆమె పేర్కొన్నారు. కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో 2023 ఏప్రిల్‌లోనే అన్సారీకి ఎంపీ ఎమ్మెల్యే కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ముఖ్తార్ అన్సారీ మృతిపై అల్కారాయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది దేవుడి ఆశీర్వాదం వల్లే జరిగింది. న్యాయం చేయాలని నేను ప్రార్థించాను. అవి ఈనాటికి ఫలించాయి’’ అని అన్నారు. తన భర్తను అన్సారీ హత్య చేసినప్పటి నుంచి తాము హోలీ పండగ చేసుకోలేదని, ఇవాళే మా కుటుంబానికి పండగ వచ్చిందన్నారు. ఎంతోమంది పిల్లల్ని అనాథల్ని చేసిన ఓ దుర్మార్గుడికి ఈ భూమిపై నూకలు చెల్లిపోయాయని, ఆ కుటుంబాలు అన్నింటికీ ఇవాళ పండగ రోజేనని అల్కారాయ్ ఆనందం వ్యక్తం చేశారు. అన్సారీ మృతిపై అనుమానాలు రేకెత్తించడం సరికాదని ప్రతిపక్షాలకు ఆమె హితవు పలికారు. కాగా, ముఖ్తార్ అన్సారీ అనారోగ్యంతో చనిపోలేదని దీనివెనక కుట్ర కోణం దాగుందని ఆయన తనయుడు ఉమర్ అన్సారీ అనుమానం వ్యక్తంచేశారు. స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారని ఆరోపించారు.