కేజ్రీవాల్ తర్వాత సీఎం ఎవరో ?

by Y. Venkata Narasimha Reddy |
కేజ్రీవాల్ తర్వాత సీఎం ఎవరో ?
X

దిశ వెబ్ డెస్క్ : రెండు రోజుల్లో ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయబోతున్న నేపథ్యంలో కేజ్రీవాల్‌ స్థానంలో సీఎంగా ఆప్ ఎవరిని ప్రతిపాదిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేజ్రీవాల్‌ రాజకీయ వారసురాలుగా ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌ కు అవకాశమిస్తారా లేక..మంత్రులలో ఒకరిని సీఎంగా ఎంపిక చేసుకుంటారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఢిల్లీ సీఎం రేసులో మంత్రులు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌, కైలాశ్‌ గెహ్లాట్‌, గోపాల్‌ రాయ్‌ పేర్లను ఆప్‌ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ జైలులో ఉన్న సమమంలో ఆయన సతిమణి సునీత కేజ్రీవాల్‌ ఆప్‌ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు ఇండియా కూటమి సమావేశాల్లో ఆప్ ప్రతినిధిగా సందడి చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున చురుకుగా ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో సునీతా పేరు కూడా సీఎం రేసులో ప్రముఖంగా ప్రచారంలో ఉంది. సీఎం రేసులో ఉన్న మంత్రుల్లో ఆర్థికశాఖ, ప్రజా పనులు, విద్యాశాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారన్న గుర్తింపు ఉన్న ఆతిశీ, ఆరోగ్య మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌, సీఎం కేజ్రీవాల్ కు సన్నిహితంగా ఉండే న్యాయశాఖ, ఐటీ, రెవెన్యూ, ప్లానింగ్ శాఖల మంత్రి కైలాశ్‌ గెహ్లాట్‌, సాధారణ పరిపాలన మంత్రి గోపాల్‌ రాయ్‌ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed