స్కూల్ పరిసరాల్లో కూల్ డ్రింక్స్ అమ్మకాలు.. WHO కీలక మార్గదర్శకాలు విడుదల

by Mahesh |   ( Updated:2024-05-21 10:06:40.0  )
స్కూల్ పరిసరాల్లో కూల్ డ్రింక్స్ అమ్మకాలు.. WHO కీలక మార్గదర్శకాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో ఆర్టీఫిషియల్ గా కెమికల్ రసయానాలను ఉపయోగించి తయారు చేసిన కూల్ డ్రింక్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ చల్లని పదార్థాలు ప్రజల దైనందిన జీవితాల్లో భాగంగా మారిపోతున్నాయి. కాగా వాటిని తాగడం వల్ల ప్రజలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో పాఠశాలల పరిసర ప్రాంతాల్లో వీటిని అమ్ముతుండటంతో విద్యార్థులు కూల్ డ్రింక్స్‌కు అలవాటు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రముఖ కూల్ డ్రింక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన చేసింది. ఈ రీసెర్చ్ లో వాటిలో భారీ మొత్తంలో షుగర్ ఉంటుందని వీటి ద్వారా సమస్యలు తలెత్తుతాయని నిర్ధారించింది. దీంతో తాజాగా WHO షుగర్ ఆధారిత అన్ని రకాల కూల్ డ్రింక్స్‌ను స్కూళ్ల పరిసరాల్లో అనుమతించకూడదని.. మార్గదర్శకాలను విడుదల చేసింది. డ్రింక్స్, పీచు మిఠాయి, ఐస్ క్రీం వల్ల పిల్లల్లో ఊబకాయం, దంతాల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. వాటిని నివారించడానికి పాఠశాలల ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే కూల్ డ్రింక్స్ కు బదులుగా మంచి నీరు, మజ్జిగ, పుదీనా, నిమ్మరసాన్ని అందుబాటులో ఉండే విధంగా చూసుకొవాలని WHO తెలిపింది.

Read More..

నాలుగు రోజుల్లో పది సప్లమెంటరీ పరీక్షలు.. షెడ్యూల్ ఇదే..!

Advertisement

Next Story