లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందంటే? సర్వేలో కీలక విషయాలు

by Ramesh N |
లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందంటే?  సర్వేలో కీలక విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో లోక్‌సభ ఎన్నికల యద్ధం మొదలైంది. ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ 195 మందితో కూడిన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను బీజేపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ ఇండియా కూటమి ఏర్పాటు చేసి ప్రధాని మోడీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. కాగా, మొత్తం లోక్‌సభలో 543 మంది సభ్యులను ఎంపిక చేసేందుకు 2024 ఏప్రిల్ లేదా మేలో భారత్ సాధారణ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది.

లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలువబోతుందనేది ఒపీనియన్ సర్వే జరిగింది. జన్‌మత్ పోల్స్‌ సంస్థ సర్వే రిపోర్ట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ 327 నుంచి 330 సీట్లు, కాంగ్రెస్ 43 నుంచి 45 సీట్లు, వైసీపీ పార్టీ 18 నుంచి 19 సీట్లు, టీఎంసీ పార్టీ 21 నుంచి 23 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ 7 నుంచి 8 స్థానాలు, బీజేడీ 9 నుంచి 10, టీడీపీ 4 నుంచి 5 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని సర్వేలో తెలిపింది. డైలీ సర్వే రిపోర్టులో భాగంగా గురువారం రోజు నిర్వహించిన సర్వే గ్రౌండ్ రిపోర్ట్‌లో తేలిందని జన్మత్ పోల్స్‌ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed