- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీని అదానీ గురించి అడిగినా.. ‘దేవుడి’ పేరే చెప్తారేమో : రాహుల్ గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: ‘‘దేవుడే పంపాడు’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్స్ పేల్చారు. ‘‘ఈ ఎన్నికల తర్వాత ప్రధాని మోడీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గురించి అడిగితే.. నాకేం తెలియదు.. దేవుడే చెప్పాడు అని బదులిస్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ గురించి అంచనా వేసుకున్న ప్రధాని మోడీ.. ఇప్పటి నుంచే ప్రతీ విషయంలో దేవుడి గురించి చెప్పడం మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు.
సోమవారం బిహార్‌లోని భక్తియార్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. “మోడీజీ సుదీర్ఘ ప్రసంగాలు ఇవ్వడం ఆపేయండి.. దేశాన్ని విభజించడం మానేయండి.. దేశంలోని యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి’’ అని ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని.. మోడీ ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ ప్రధాని కాలేరని కాంగ్రెస్ అగ్రనేత స్పష్టం చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.8,500 జమ చేస్తామని రాహుల్ గాంధీ హామీఇచ్చారు.