'నడ్డా జీ.. దేశంలో ఏం జరుగుతోంది'.. విదేశాల నుంచి రాగానే ప్రశ్నించిన మోడీ

by Vinod kumar |
నడ్డా జీ.. దేశంలో ఏం జరుగుతోంది.. విదేశాల నుంచి రాగానే ప్రశ్నించిన మోడీ
X

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ భారత్‌లో ఉన్నా.. విదేశాల్లో ఉన్నా.. ఆయన మనసు మాత్రం ఎప్పుడూ దేశం చుట్టే తిరుగుతుంది. ఆయన ఎక్కడున్నా భారత్‌లో జరిగే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో అమెరికా, ఈజిప్ట్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకొని సోమవారం ఉదయం భారత్ తిరిగొచ్చిన ప్రధాని మోడీకి బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా.. ‘నడ్డా జీ.. దేశంలో ఏం జరుగుతోంది’ అని ప్రశ్నించారు.

‘బీజేపీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల రిపోర్ట్ కార్డ్‌తో పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నారు. దేశం సంతోషంగా ఉంది’ అని నడ్డా జవాబిచ్చారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ విలేకరులతో చెప్పారు. మోడీకి స్వాగతం పలికిన వారిలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఎంపీలు హర్షవర్ధన్, హన్స్‌రాజ్ హన్స్, పర్వేశ్ వర్మ, గౌతమ్ గంభీర్, ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed