Kolkata rape horror:డైరీలో చిరిగిన పేజీ.. మెడికో హత్య కేసులో ట్విస్ట్

by Shamantha N |
Kolkata rape horror:డైరీలో చిరిగిన పేజీ.. మెడికో హత్య కేసులో ట్విస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా మెడికో హత్యాచారం కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చంది. తమ కుమార్తె డైరీలోని పేజీ చిరిగి ఉందని బాధితురాలి తండ్రి అంటున్నారు. ‘‘మా కుమార్తె బ్యాగులో ఎప్పుడూ ఓ డైరీ ఉంటుంది. దాన్ని మేం ఎప్పుడూ చదవం. అయితే, మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత రోజూ అన్ని విషయాలు మాతోనే పంచుకుంటుంది. ఈ ఘటన తర్వాత తన డైరీ చూస్తే అందులో ఓ పేజీ కొంత చిరిగిపోయి ఉంది. దానికి సంబంధించిన ఫొటో నా దగ్గరే ఉంది” అని యువతి తండ్రి మీడియాకు తెలిపారు. అయితే, ఆ డైరీలో ఏముందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఆ విషయాలను బహిరంగంగా చర్చించొద్దని సీబీఐ (CBI) తమకు సూచించినట్లు తెలిపారు.

యువతి శరీరంపై 14 చోట్ల గాయాలు..

ఇదిలా ఉండగా.. వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదిక గురించి మరిన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె శరీరంపై 14 చోట్ల గాయాలున్నాయని శవపరీక్షలో గుర్తించినట్లు వార్తలొస్తున్నాయి. బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఊపరితీత్తుల్లోనూ బ్లీడింగ్ జరిగినట్లు పోస్టుమార్టంలో గుర్తించారు. నిందితుడితో ఆమె శక్తిమేరకు పోరాడి ఉంటుందని వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారు. నిందితుడు సంజయ్‌ రాయ్‌కి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు అతడి శరీరంపై గోళ్లతో రక్కిన గుర్తులు కన్పించినట్లు సమాచారం. బాధితురాలి గోళ్లలో ఉన్న నమూనాలు నిందితుడితో సరిపోలినట్లు తెలుస్తోంది. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లే ఆమె మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారు. బాధితురాలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో నిందితుడు ఈ దాడికి పాల్పడి ఉంటాడని ఆ నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed