West Bengal : కోల్‌కతా మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ‘రిజిస్ట్రేషన్’ రద్దు

by Hajipasha |
West Bengal : కోల్‌కతా మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ‘రిజిస్ట్రేషన్’ రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతం కేసులో సీబీఐ అరెస్టు చేసిన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై కొరడా ఝుళిపించింది. ఆయనకు సంబంధించిన మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ గురువారం వెల్లడించింది.

రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ సందీప్ ఘోష్‌కు బెంగాల్ మెడికల్ కౌన్సిల్ సెప్టెంబరు 6న షోకాజ్ నోటీసులను పంపింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఆయన నుంచి వివరణ అందలేదు. దీంతో రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించడంలో, సాక్ష్యాలను మాయం చేయడంలో సందీప్ పాత్ర ఉందనే అభియోగాలను సీబీఐ నమోదు చేసింది.

Advertisement

Next Story

Most Viewed