ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్‌ రాష్ట్రాలకు వేడిగాలుల నుంచి ఉపశమనం: ఐఎండీ

by S Gopi |
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్‌ రాష్ట్రాలకు వేడిగాలుల నుంచి ఉపశమనం: ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇప్పటికే భారీ ఎండలు, తీవ్రమైన వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు శుభవార్త అందించింది. ఈ రాష్ట్రాల్లో మూడు రోజుల తర్వాత వేడిగాలులు తగ్గుతాయని ఐఎండీ శుక్రవారం తెలిపింది. ఆ తర్వాత ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త డా నరేష్ కుమార్ చెప్పారు. అలాగే, దక్షిణ ప్రాంతాలకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు వేడి వాతావరణం కొనసాగుతుందన్నారు. తెలంగాణ, బెంగాల్, కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 5, 6 తేదీల్లో ఈశాన్య భారతదేశంలో ఉరుములు, గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మూడు-నాలుగు రోజుల తర్వాత దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండొచ్చని ఐఎండీ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed