- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బార్డర్‌లో ఆయుధాలున్నాయ్.. పోలీసులపై తిరగబడండి.. రైతులను రెచ్చగొట్టేలా ‘పన్నూ’ వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలో తలదాచుకుంటున్న ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి రెచ్చిపోయాడు. ఢిల్లీ బార్డర్‌లో రైతులు తెలుపుతున్న నిరసనలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘హర్యానా, పంజాబ్ పోలీసులపై రైతులు తిరగబడాలి. అవసరమైతే తుపాకులు చేతపట్టాలి. పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ నుంచి రైతులు ఆయుధాలను తెచ్చుకోవాలి’’ అనే రెచ్చగొట్టే కామెంట్స్‌తో ఒక వీడియోను విడుదల చేశాడు. హర్యానా - పంజాబ్ సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీ పాయింట్ల వద్ద ఆందోళన చేస్తున్న రైతులు తుపాకులు చేతపట్టాలని ఈ సందేశంలో పేర్కొన్నాడు. ‘‘బుల్లెట్లకు బుల్లెట్లతోనే జవాబు చెప్పాలి. ఆయుధాలు కావాలంటే పాకిస్తాన్ బార్డర్‌లోని కర్తార్‌పూర్‌కు వెళ్లి తెచ్చుకోండి’’ అని అతడు వ్యాఖ్యానించాడు. రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రుల టీమ్ నాలుగో విడత చర్చలు జరపడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు గురుపత్వంత్ ఈ వీడియో సందేశాన్ని విడుదల చేయడం గమనార్హం. ఇటువంటి ప్రమాదకర ఖలిస్తానీ ఉగ్రవాదులు అమెరికా, కెనడా దేశాలు ఆశ్రయం కల్పిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.