- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమేథీ, రాయ్‌బరేలీలో భారీ మెజారిటీలో గెలుస్తాం: కాంగ్రెస్ నేత భూపేష్ భఘేల్
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భఘేల్ దీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన రాయ్ బరేలీలో మీడియాతో మాట్లాడారు. ఇందిరాగాంధీ పోటీ చేసినప్పటి నుంచి ఈ రెండు స్థానాలకు గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. రాయ్ బరేలీలో రాహుల్ గాంధీని పోటీకి దింపడం హైకమాండ్ నిర్ణయమని చెప్పారు. రాహుల్ అమేథీ నుంచి పారిపోయారంటూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గాంధీ కుటుంబం ఎవరికీ భయపడబోదని, దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని కొనియాడారు. అలాంటి కుటుంబం గురించి మాట్లాడుతూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. దీని వల్ల ప్రసంగాల స్థాయి కూడా తగ్గిపోతుందని తెలిపారు. స్మృతీ ఇరానీకి అమేథీలో ఓటమి తప్పదని స్పష్టం చేశారు. అమేథీ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన కిశోరీ లాల్ శర్మ 40ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఇంటితోనూ ఆయనకు సంబంధాలున్నాయని వెల్లడించారు. ఇక్కడ కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు.