Sheikh Hasina : షేక్ హసీనా కోసం ఇంటర్ పోల్ సాయం తీసుకుంటాం : బంగ్లాదేశ్

by M.Rajitha |
Sheikh Hasina : షేక్ హసీనా కోసం ఇంటర్ పోల్ సాయం తీసుకుంటాం : బంగ్లాదేశ్
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్(Bangladesh) మాజీ ప్రధానిని స్వదేశానికి రప్పించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా ఇంటర్ పోల్(Interpol) సహాయం తీసుకొని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)ను తిరిగి రప్పించనున్నట్టు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. అనేక నేరారోపణలపై హసీనా స్వదేశంలో విచారణ ఎదుర్కోవాల్సి ఉందని, అందుకు ఆమెను వెతికేందుకు ఇంటర్ పోల్ సాయం కోరతామని వెల్లడించింది. కాగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హసీనా ప్రభుత్వం నిరసనకారులను అణచి వేయడంతో.. బంగ్లాదేశ్ లో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ఈ గొడవల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. షేక్ హసీనాతోపాటు.. పలువురు నేతలు దేశం వదిలి పారిపోయారు. హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతోంది.

Advertisement

Next Story