- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కర్ణాటక ప్రజలకు ఆ 5 హామీలు తప్పక నేరవేరుస్తాం: రాహుల్ గాంధీ
దిశ, డైనమిక్ బ్యూరో: తమ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య తదితరుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. బీజేపీ వద్ద డబ్బు, పోలీసులు అన్నీ ఉన్నాయని కానీ వారిని ప్రజలు విశ్వసించలేదన్నారు. కర్ణాటకలో విద్వేషంపై ప్రేమ గెలిచిందని.. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ వెంట పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులు బాసటగా ఉన్నారని.. అందువల్లే ఇక్కడ ఎన్నికల్లో గెలుపు సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రజలకు 5 ప్రధాన హామీలను ఇచ్చిందని ఆ హామీలకు తొలి కేబినెట్ సమావేశంలో చట్టబద్దత కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వదని.. ఏది చేస్తామో అదే చెబుతామన్నారు. కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు:
*గృహ జ్యోతి పథకం కింద ప్రతి నెలా ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
*గృహ లక్ష్మి పథకం ద్వారా ఇంటి పెద్దలకు నెలవారీ రూ. 2000
*రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం
*నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌లకు ప్రతి నెల రూ.3,000, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్‌లకు రూ. 1,500
*దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు ఒక్కొక్కరికి 10కిలోల ఉచిత బియ్యం