One Nation One Election : ‘జమిలి’ వ్యవహారం ఆర్టికల్ 370లా జరగొద్దు : ఒమర్ అబ్దుల్లా

by Hajipasha |   ( Updated:2024-12-13 15:25:32.0  )
One Nation One Election : ‘జమిలి’ వ్యవహారం ఆర్టికల్ 370లా జరగొద్దు :  ఒమర్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో : జమిలి ఎన్నికల ప్రతిపాదనపై జమ్మూకశ్మీర్(Jammu Kashmir) సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల బిల్లులోని అంశాలన్నీ పారదర్శకంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. వాటిపై పార్లమెంటు(Parliament)లో స్వేచ్ఛగా చర్చ జరిగే అవకాశాన్ని కల్పించాలని కోరారు. 2019 సంవత్సరంలో నిరంకుశంగా ఆర్టికల్ 370ని రద్దు చేసినట్టుగా జమిలి ఎన్నికల(One Nation One Election) బిల్లు విషయంలోనూ ఏకపక్ష నిర్ణయం జరగకూడదని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

‘‘జమిలి ఎన్నికల బిల్లుపై చర్చలో మా పార్టీ (నేషనల్ కాన్ఫరెన్స్) ఎంపీలు కూడా పాల్గొంటారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభిప్రాయాన్ని ఎంపీలు పార్లమెంటులో తెలియజేస్తారు. ఆ బిల్లుపై ఏ విధంగా ఓటు వేయాలనే దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయన వెల్లడించారు. కాగా, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మియా అల్తాఫ్ స్పందిస్తూ.. ‘‘జమిలి ఎన్నికల ప్రక్రియ వల్ల మన దేశంలోని ప్రజాస్వామిక స్వరూపానికి విఘాతం కలుగుతుంది’’ అని కామెంట్ చేశారు.

Read More..

Akhilesh yadav: ఓటర్లను బీజేపీ గౌరవించట్లేదు.. అఖిలేష్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు

Advertisement

Next Story