Hillary Clinton: డొనాల్డ్ ట్రంప్‌పై హిల్లరీ క్లింటర్ విమర్శలు

by S Gopi |
Hillary Clinton: డొనాల్డ్ ట్రంప్‌పై హిల్లరీ క్లింటర్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హిల్లరీ క్లింటర్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. సోమవారం చికాగోలో జరిగిన డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో మాట్లాడుతూ.. డెమొక్రటిక్ పార్టీ వర్గాలు ట్రంప్ పారిపోయేలా చేశారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న కమలా హ్యారీస్ నాయకత్వాన్ని ప్రశంసించారు. కమలా హ్యారీస్ పిల్లలు, దేశంలో కుటుంబాల గురించి ఆలోచిస్తారు. అమెరికా గురించి బాధ్యత తీసుకుంటారు. కానీ ట్రంప్ అలాంటి వ్యక్తి కాదని, తన గురించి మాత్రమే చూసుకుంటారని విమర్శించారు. 'కమలా హ్యారీస్ ప్రజల కోసం అంటూ ముందుకు వచ్చారని, డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆమెపై రకరకాల విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఆయనే పారిపోయారని క్లింటర్ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ట్రంప్‌పై ఉన్న చట్టపరమైన వివాదాల గురించి ఆమె ప్రస్తావించారు. ట్రంప్ 34 నేరారోపణలతో అధ్యక్ష పదివికి పోటీ చేస్తున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారని విమర్శించారు.

Advertisement

Next Story