Bengal : సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిందే : బెంగాల్ బీజేపీ చీఫ్

by Hajipasha |
Bengal : సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిందే : బెంగాల్ బీజేపీ చీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతానికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ డిమాండ్ చేశారు. మమతా బెనర్జీ సర్కారుపై సుప్రీంకోర్టుకు విశ్వాసం లేదని మంగళవారం రోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామాను కోరుతూ బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో కోల్‌కతాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సుకాంత మజుందార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘బెంగాల్‌లో మహిళలపై అఘాయిత్యాలు అస్సలు ఆగడం లేదు. పాలనపై మమతా బెనర్జీ నియంత్రణ కోల్పోయారు అనేందుకు ఈ పరిస్థితే ప్రత్యక్ష నిదర్శనం’’ అని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీ ఘటన నేపథ్యంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. సెప్టెంబరు 5 వరకు బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలను కొనసాగిస్తామని సుకాంత మజుందార్ స్పష్టం చేశారు. చనిపోయిన జూనియర్ వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బెంగాల్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి లాకెట్ ఛటర్జీ కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నందుకు మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిందేనన్నారు.

Advertisement

Next Story