- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అరేబియా సముద్రంలో ప్రధాని మోడీ డైవింగ్
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో డైవింగ్ చేశారు. నీటి అడుగున హిందువుల పురాతన ఆధ్యాత్మిక నగరం ద్వారక వద్ద పూజలు చేశారు. శ్రీకృష్ణుడితో అనుబంధానానికి పేరుగాంచిన ద్వారక ఒకప్పుడు అభివృద్ధి చెందిన నగరం, శతాబ్దాల క్రితం సముద్రంలో మునిగిపోయిందని నమ్ముతారు. బెట్ ద్వారకా ద్వీపం దగ్గర స్కూబా డైవింగ్ ద్వారా మోడీ సముద్ర జలాల్లోకి వెళ్లారు. నీటి అడుగున వెళ్లి పురాతన అవశేషాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీని గురించి ప్రధాని సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకున్నారు. 'సముద్ర గర్భంలో ఉన్న ద్వారకాలో పూజలు చేయడం ఒక దివ్యానుభవం. పురాతన యుగానికి చెందిన కాలాతీత భక్తితో అనుసంధానం అయ్యాను. శ్రీకృష్ణుడు అందరినీ అనుగ్రహిస్తారని ' మోడీ ట్వీట్ చేశారు. అనంతరం తన అనుభవాన్ని వివరిస్తూ ఎక్స్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. 'నీటి కింద ద్వారకా దర్శనం... ఆధ్యాత్మికం, చారిత్రక సంగమం. ఇక్కడ ప్రతీ క్షణం భగవాన్ శ్రీ కృష్ణుని శాశ్వతమైన ఉనికిని ప్రతిధ్వనించే ఒక దివ్యమైన రాగం ఉంది' అన్నారు. ప్రధాని మోడీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనలో స్కూబా డైవింగ్ చేసిన సంగతి తెలిసిందే.