Doctors Death : అది టార్గెట్ కిల్లింగ్‌ ?.. జూనియర్ వైద్యురాలి హత్యపై సంచలన కథనాలు

by Hajipasha |   ( Updated:2024-08-18 12:33:44.0  )
Doctors Death : అది టార్గెట్ కిల్లింగ్‌ ?.. జూనియర్ వైద్యురాలి హత్యపై సంచలన కథనాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌‌లో జూనియర్ వైద్యురాలిపై ఆగస్టు 8న రాత్రి జరిగిన హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగాన్ని పుంజుకుంది. ఈ తరుణంలో పలు కీలక విషయాలతో జాతీయ మీడియాలో సంచలన కథనాలు వచ్చాయి. జూనియర్ వైద్యురాలిని అంత దారుణంగా ఎందుకు హింసించి చంపారు ? ఇందుకు ఏదైనా బలమైన కారణం ఉందా ? అనే అంశాలను ఆ కథనాల్లో ప్రస్తావించారు.

కంటిన్యూగా 36 గంటల డ్యూటీ..

జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులను సీబీఐ టీమ్ కలిసి ఇప్పటికే స్టేట్‌మెంట్‌ను సేకరించింది. ఆ రోజు తమ కూతురితో పాటు నైట్ డ్యూటీ చేసినవారు, బ్యాచ్‌మేట్లు, సీనియర్లు, ఆస్పత్రి అధికారులపై తమకు అనుమానం ఉందని వారు స్పష్టంగా సీబీఐకి చెప్పారు. గతంలో ఓ సీనియర్ వల్ల తమ కూతురు బాగా ఇబ్బందిపడిందని జూనియర్ వైద్యురాలి పేరెంట్స్ తెలిపారు. ఈ కోణంలో ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. ఈనేపథ్యంలో సదరు జూనియర్ వైద్యురాలితో కలిసి పనిచేసిన పలువురు వైద్య సిబ్బందిని ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేయగా.. ‘‘అది టార్గెట్ కిల్లింగ్‌ అయి ఉండొచ్చు’’ అని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ అదే నిజమై ఉంటే.. జూనియర్ వైద్యురాలిని ఎందుకు టాార్గెట్ చేశారు ? ఆమెకు కంటిన్యూాగా ఆస్పత్రిలో 36 గంటల డ్యూటీ ఎందుకు వేశారు ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంటుంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్ మాఫియా వివరాలను తెలుసుకున్నందు వల్లే ఆమెను దారుణంగా హింసించి చంపి ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే సీబీఐ తగిన ఆధారాలను గుర్తిస్తే తప్ప దీన్ని నమ్మడానికి వీలుండదు.

ఆ రోజు రాత్రి ప్రిన్సిపల్ ఏమయ్యారు ?

జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆగస్టు 8న రాత్రి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఎవరికీ కనిపించకుండా పోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఆ రాత్రి కాలేజీలో ఎందుకు లేరు ? ఎక్కడికి వెళ్లారు ? అనే ప్రశ్నలకు సమాధానాలను పొందే ప్రయత్నంలోనే ప్రస్తుతం సీబీఐ టీమ్ ఉంది. ఆగస్టు 9న తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల టైంలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో ఉంది.

Advertisement

Next Story

Most Viewed