అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడో చెప్పేసిన ఖర్గే

by Hajipasha |
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడో చెప్పేసిన ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలకు పార్టీ అభ్యర్థుల పేర్లను కొద్ది రోజుల్లోనే ప్రకటిస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ‘‘ఆయా నియోజకవర్గాల ప్రజల నుంచి అభ్యర్థుల పేర్లు నా వద్దకు చేరాక.. నేను నోటిఫికేషన్‌పై సంతకం చేసి ప్రకటన చేస్తా’’ అని ఆయన తెలిపారు. శనివారం అసోంలోని గువహటిలో విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి వయనాడ్ లోక్‌సభ సీటుకు మారిపోవడంపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండటాన్ని ఖర్గే తప్పుపట్టారు. వాజ్‌పేయి, అద్వానీలు ఎన్నిసార్లు లోక్‌సభ స్థానాలు మారారో తనకు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేసే ముందు.. దాన్ని పూర్తిగా చదవాలని ప్రధాని మోడీకి ఖర్గే సూచించారు. ‘‘ఖర్గేజీ బీజేపీలో చేరండి’’ అంటూ అసోం సీఎం హిమంత బిస్వ శర్మ చేసిన కామెంట్‌పై కాంగ్రెస్ చీఫ్ స్పందిస్తూ.. ‘‘నేను పార్లమెంటులో నాకు ప్రత్యర్ధిగా ఉన్న ప్రధాని మోడీతో మాట్లాడుతానే తప్ప.. ఒక సీఎంతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు’’ అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story