విమానానికి బాంబు బెదిరింపు.. లోపల 300 మందికి పైగా ప్రయాణికులు

by Harish |   ( Updated:2024-06-02 09:23:34.0  )
విమానానికి బాంబు బెదిరింపు.. లోపల 300 మందికి పైగా ప్రయాణికులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల వరుసగా అగంతకులు నుంచి విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. శుక్రవారం ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి ఇలాంటి బెదిరింపు కాల్ రాగా, ఇప్పుడు మళ్లీ ఆదివారం పారిస్-ముంబై మధ్య ప్రయాణించే విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది, అధికారులు తీవ్ర భయాందోళనకు గురి కాగా విమానం 10:19 గంటలకు సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పారిస్‌‌లోని చార్లెస్ డి గుల్లె విమానాశ్రయం నుంచి 12 మంది సిబ్బందితో సహా 306 మంది ప్రయాణికులతో UK 024 విమానం ముంబైకి బయలుదేరింది. విమానం గాల్లో ఉండగానే లోపల బాంబు ఉన్నట్లుగా ఎయిర్‌సిక్‌నెస్ బ్యాగ్‌పై చేతితో వ్రాసిన నోట్ కనిపించింది. దీంతో విమానం లోపల ఉన్న ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. వారు విమానాశ్రయంలో భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

ల్యాండ్ అయిన వెంటనే చెకింగ్ బేకు తరలించి ప్రయాణికులను క్షేమంగా క్రిందికి దింపారు. భద్రతా సిబ్బంది విమానం లోపల క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం, ఢిల్లీ నుండి విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శ్రీనగర్ విమానాశ్రయంలో కార్యకలాపాలు గంటపాటు దెబ్బతిన్నాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు, స్నిఫర్ డాగ్‌ల సహాయంతో విమానంలో సోదాలు చేపట్టారు. అయితే అది బూటకపు కాల్ అని తేలింది. మే 28న కూడా ఇండిగోకు చెందిన ఢిల్లీ-వారణాసి విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది, అది ఫేక్ కాల్ అని అధికారులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed