Breaking News : వైసీపీకి మరో భారీ షాక్.. పార్టీని వీడనున్న మరో మాజీ మంత్రి!

by M.Rajitha |   ( Updated:2024-10-28 15:50:11.0  )
Breaking News : వైసీపీకి మరో భారీ షాక్.. పార్టీని వీడనున్న మరో మాజీ మంత్రి!
X

దిశ, వెబ్ డెస్క్ : వైఎస్ఆర్సీపీ(YSRCP) పార్టీకి మరో భారీ షాక్ తగలనుందనే వార్తలు వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లి పోతున్నారు. పార్టీలో ఉన్నంతసేపు క్రమశిక్షణ గల నాయకులుగా ఉన్నవారంత ప్రభుత్వాన్ని కోల్పోగానే ప్లేటు ఫిరాయిస్తున్నారు. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి విడదల రజినీ(Vidadala Rajini) పార్టికి రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయం గురించి రజనీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ మాత్రం లేదు.

వైసీపీలో కీలక నేతగా ఉన్న రజనీని జగన్ గుంటూరు నుంచి పోటీ చేయించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఓటమిలో భాగంగా ఆమె కూడా ఓడిపోయారు. అయినా జగన్‌ ఏర్పాటు చేసిన ప్రతి సమావేశానికి క్రమం తప్పకుండా హాజరవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో రజిని రాజీనామా వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.


👉Also Read: YS Jagan:‘దీపావళి కానుక ఇదేనా చంద్రబాబు?’.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story