Vinesh Phogat: హర్యానా ఎన్నికల్లో సంచలనం.. జులానాలో వినేష్ ఫోగట్ జయకేతనం

by Shiva |   ( Updated:2024-10-08 08:04:55.0  )
Vinesh Phogat: హర్యానా ఎన్నికల్లో సంచలనం.. జులానాలో వినేష్ ఫోగట్ జయకేతనం
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా (Haryana)లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రతి రౌండ్‌కు ఆధిక్యాలు మారుతుండటంతో విజయం చివరి వరకు దోబూచులాడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున జులానా నుంచి బరిలోకి దిగిన భారత్ మాజీ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ (Vinesh Phogat) తన సమీప బీజేపీ (BJP) ప్రత్యర్థి యోగేశ్‌ కుమార్‌ (Yogesh Kumar)‌పై 6 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. అంతకు ముందు ఆమె 2 వేల ఓట్ల వెనుకంజలో ఉన్న తరుణంలో పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అనూహ్యంగా ఆ తరువాత రౌండ్‌లో ఫోగాట్ తిరిగి పుంజకుని విజయం సాధించింది. కాగా, హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ (BJP) అభ్యర్థులు 48 స్థానాల్లో.. కాంగ్రెస్ (Congress) అభ్యర్థులు 36 స్థానాల్లో, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed