Vinesh Phogat: కాంగ్రెస్ పార్టీలో చేరికపై మాట్లాడుకోదల్చుకోలేదు

by Shamantha N |   ( Updated:2024-08-31 11:11:03.0  )
Vinesh Phogat: కాంగ్రెస్ పార్టీలో చేరికపై మాట్లాడుకోదల్చుకోలేదు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రత్యక్షరాజకీయాల్లోకి రావడం గురించి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్పందించారు. హర్యానాలోని అంబాలకు సమీపంలో శంభూ సరిహద్దు దగ్గర రైతులు కొన్నాళ్లుగా ఆందోళన చేపడుతున్నారు. అయితే, వినేశ్ ఫొగాట్ ఆ ఆందోళనలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఆందోళన 200వ రోజుకు చేరడంతో ఆ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం తెలిపారు. మీ కుమార్తె మీ వెంటే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలే చేరుతున్నారనా అనే ప్రశ్నపై వినేశ్ ఫొగాట్ స్పందించారు. అయితే, ఈ అంశంపై తాను మాట్లాడదల్చుకోలేదన్నారు. తన రైతు కుటుంబాన్ని కలుసుకునేందకే ఇక్కడికి వచ్చానని అన్నారు. మీరు నా గురించి మాట్లాడితే.. రైతుల పోరాటాలు, కష్టాలు వృథా అవుతాయన్నారు. ఇక్కడ తనపై ఫోకస్ పెట్టొద్దన్నారు. రైతులపైనే ఫోకస్ చేయాలని కోరారు. “నేనొక క్రీడాకారిణిని, భారతీయురాలిని. ఎన్నికలపై నాకు ఎలాంటి ఆందోళన లేదు. రైతుల సంక్షేమంపై మాత్రమే నా దృష్టి ఉంది’’ అని జవాబిచ్చారు.

తగ్గేదేలే..

ఈ సందర్భంగా ఆందోళనను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘నేను రైతు కుటుంబానికి చెందినందుకు అదృష్టంగా భావిస్తున్నా. మీ కుమార్తె మీతోనే ఉంది. మన హక్కుల కోసం ఎవరూ పోరాడరు. మనమే నిలబడాలి. ఎవరూ రారు. మీ డిమాండ్లు పూర్తి కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. వాటిని సాధించుకోకుండా వెనక్కి తగ్గొద్దు. రైతులు తమ హక్కుల కోసం 200 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఈ డిమాండ్లను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. కానీ, కేంద్రం మాత్రం మీ డిమాండ్లు వినకపోవడం బాధాకరం’’ అని పేర్కొన్నారు. ఢిల్లీలో ర్యాలీకి అధికారులు నిరాకరించడంతో రైతులు ఫిబ్రవరి 13 నుంచి శంభూ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టారు. పంటలకు చెల్లించే కనీస మద్దతు ధరకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed