Haryana Election Result : ‘ప్రతి అమ్మాయి పోరాటం’ గెలిచిన తర్వాత వినేష్ ఫోగట్ ఫస్ట్ రియాక్షన్

by Ramesh N |
Haryana Election Result : ‘ప్రతి అమ్మాయి పోరాటం’ గెలిచిన తర్వాత వినేష్ ఫోగట్ ఫస్ట్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో రెజ్లర్ వినేష్‌ ఫోగట్‌ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్‌కుమార్‌పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వినేష్ ఫోగట్‌ గెలుపొందారు. తన ప్రత్యర్థిని 5761 ఓట్ల తేడాతో ఓడించింది. అనంతరం గెలిచిన తర్వాత ఫోగాట్ ప్రజలకు అభివాదం చేశారు. ఈ నేపథ్యంలోనే వినేష్ ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు పోరాటం గెలిచింది నిజం గెలిచింది.. అని హర్షం వ్యక్తం చేశారు. ఫలితాల్లో ప్రజల ప్రేమే కనిపిస్తోందన్నారు. ఇది ప్రజల విజయం అని, తాను ముఖం మాత్రమేనని అన్నారు.

రాబోయే ఐదేళ్ల పాటు ప్రజలు మాపై చూపిన ప్రేమను మేము కొనసాగించేలా చూస్తాము.. వారి అంచనాలను అందుకోవడానికి మేము కృషి చేస్తామని అన్నారు. ఈ పోరాటం ప్రతి అమ్మాయి పోరాటం అని, పోరాడే మార్గాన్ని ఎంచుకునే ప్రతి మహిళ పోరాటానికి ఈ విజయం సూచిస్తోందన్నారు. ఈ దేశం నాకిచ్చిన ప్రేమను, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత, రెజ్లర్ బజరంగ్ పునియా దేశ పుత్రిక వినేష్ ఫోగట్ విజయం సాధించినందుకు ఆమెకు అభినందనలు.. అంటూ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed