శ్యామా ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరింది : ఉపరాష్ట్రపతి

by Hajipasha |
శ్యామా ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరింది : ఉపరాష్ట్రపతి
X

దిశ, నేషనల్ బ్యూరో : జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరిందని.. శాసన శాఖ, న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ అన్నింటి నుంచి ఆర్టికల్ 370 తొలగించబడిందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు అవుతుందని ఎవరూ ఊహించలేదని ఆయన కామెంట్ చేశారు. ఆర్టికల్ 370 తొలగిపోవడంతో.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ అడుగులతో పునీతమైన ఈ భారతావనికి పెనుముప్పు తప్పిందన్నారు. రాజ్యాంగంలో తాత్కాలికంగా పేర్కొన్న ఈ ఆర్టికల్ యావత్ దేశానికి గతంలో పెనుశాపంగా పరిణమించిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు వల్లే జమ్మూ కాశ్మీర్‌ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందని ఉపరాష్ట్రపతి చెప్పారు. ప్రస్తుతం కశ్మీర్‌లో శాంతి, స్థిరత్వం, పబ్లిక్ ఆర్డర్ కనిపిస్తున్నాయని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో జరిగిన బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పోను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story