- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భలే కామెడీ : వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!
దిశ, ఫీచర్స్ : పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన తీపి జ్ఞాపకం. అందుకే పెళ్లిని ఎప్పటికీ గుర్తు ఉండిపోయేలా.. అందంగా, ట్రెండీగా చేసుకోవాలి అనుకుంటారు కొంతమంది. అంతే కాకుండా ఈ మధ్య పెళ్లి వేడుకల కోసం కోట్ల డబ్బు ఖర్చు పెట్టి, ఫ్రీ వెడ్డింగ్ షూట్, హల్దీ , రీల్స్ ఇలా డిఫరెంట్‌గా ట్రై చేస్తూ పెళ్లి చేసుకుంటున్నారు. ముఖ్యంగా, వెడ్డింగ్ కార్డు కూడా చాలా డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు.
పెళ్లికి బంధువులను ఆహ్వానించే పెళ్లి పత్రిక డిజైన్ పట్ల పెండ్లి వారు కొత్తగా ఆలోచిస్తూ, వెరైటీగా వెడ్డింకార్డ్స్ పంచుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కార్డ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి పెళ్లి కార్డు ఒకటి వైరల్ అవుతోంది. రోహిత్, రజనీల పెళ్లి కార్డులో రాసి ఉన్న పదాలు చూసి జనాలు చదివి ఆశ్చర్యపోయారు. ఈ వివాహ ఆహ్వాన పత్రికలో వధూవరుల పేర్ల దగ్గర అతిథుల పేర్లు ముద్రించారు. అంతే కాదు దీంతో పాటు ఓ మెసేజ్ కూడా పెట్టారు.అది ఏంటో తెలిస్తే మీరు కచ్చితంగా నవ్వకుండా ఉండలేరు. పెళ్లికి ఆహ్వానిస్తున్న వ్యక్తి ఈ వెడ్డింగ్ కార్డుపై చాలా మంది పేర్లను రాశాడు. ఒక ప్రత్యేకమైన విషయం కూడా రాశారు. ఆయన తన పెళ్లి కార్డులో.. కింద గమనిక అని పెట్టి.. నేను వధువు పెళ్లికి సౌరభ్ అనే వ్యక్తిని అనుమతించలేదు. సౌరభ్ ఈ పెళ్లికి వచ్చి ఉంటే, మీకు కనిపిస్తే అతనిని ఇక్కడి నుంచి తరిమి కొట్టండి . ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చాడు. ఇక ఇది చూసిన వారు తెగ నవ్వుకుంటున్నారు. వెడ్డింగ్ కార్డుపై ఇలా కూడా పెట్టొచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.