- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఘోర రోడ్డు ప్రమాదం.. 36 కు చేరిన మృతుల సంఖ్య
దిశ, వెబ్ డెస్క్: సోమవారం తెల్లవారుజామున ఉత్తరఖాండ్(Uttarakhand) రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(road accident ) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. మర్చులా ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మొదట 15 మంది అక్కడిక్కడే మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ (SDRF) ప్రమాదం జరిగిన మార్చులా సాల్ట్ ఏరియాకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా సహాయక చర్యల అనంతరం మృతుల సంఖ్య భారీగా పెరిగింది. తీవ్ర గాయాలు కావడంతో మరో 21 మంది ఆస్పత్రికి తీసుకెళ్లి లోపు చనిపోయారు. దీంతో మొత్తం ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 36 కు చేరుకుందని.. స్థానిక అధికారులు తెలిపారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా మృతి చెందిన వారు కాకుండా బస్సులో ఉన్న మిగిలిన ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నామని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ ప్రాంత సబ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ తెలిపారు.