మోడీ పర్యటన వేళ.. భారతీయులకు బైడెన్ గుడ్ న్యూస్?

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-22 08:22:57.0  )
మోడీ పర్యటన వేళ.. భారతీయులకు బైడెన్ గుడ్ న్యూస్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా యూఎస్‌కు చేరుకున్న మోడీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉంటే మోడీ యూఎస్ పర్యటనలో ఉండగానే భారతీయులకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. హెచ్-1 బీ వీసా పునరుద్దరణ విధానాన్ని మరింత సరళీకరించేలా బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం.

హెచ్-1 బీ వీసాల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా యూఎస్ గవర్నమెంట్ ఇవాళ కీలక ప్రకటన చేయబోతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే లక్షలాది మంది భారతీయ ఎన్ఆర్ఐలకు మేలు కలిగే అవకాశం ఉంటుంది. అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు హెచ్-1 బీ వీసా అవకాశం కల్పిస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,42,000 మంది హెచ్-1 బీ వీసా వినియోగదారులు ఉంటే దాంట్లో 73 శాతం మంది భారతీయులే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ తరహా వీసాల రెన్యువల్ కోసం తీవ్ర జాప్యం జరుగుతుండగా దీనిని మరింత సులభతరం చేసేలా పైలట్ ప్రాజెక్టును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story