- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాక్ కు సాయం చేసిన చైనా కంపెనీలు.. ఆంక్షలు విధించిన అమెరికా..
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాంలకు పరికరాలు సరఫరా చేస్తున్న 3 చైనా సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ మూడు చైనా సంస్థలే కాకుండా బెలారస్ కు చెందిన కంపెనీపైనా ఆంక్షలు విధించింది. సామూహిక విధ్వంసకర ఆయుధాలతో చేపట్టే కార్యకలాపాల్లో ఈ కంపెనీలు ఉన్నాయని పేర్కొన్నారు అమెరికా విదేశాంగ ప్రతినిధి. ఆయుధాలు, ఆయుధ సాంకేతికత విస్తరణను అడ్డుకునేందుకు అమెరికా కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
పాకిస్థాన్ మిత్రదేశమైన చైనా.. ఆయుధాలు, రక్షణ పరికరాలను సరఫరా చేస్తూ ఆ దేశ సైనిక ఆధునికీకరణకు తోడ్పడుతోంది. బీజింగ్‌కు చెందిన జియాన్ లాంగ్డే సంస్థ పాకిస్థాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాంకు ఫిలమెంట్ వైండింగ్ మెషీన్ సహా మిసైల్ రిలేటర్ పరికరాలు సరఫరా చేసిందని అమెరికా ఆరోపించింది. గ్రాన్‌పెక్ట్, టియాంజిన్ కంపెనీలు రాకెట్ మోటార్‌లను పరీక్షించే, ప్రొపెల్లెంట్ ట్యాంకుల తయారీకి వినియోగించే సామగ్రిని సమకూర్చాయంది. బెలారస్‌లోని మిన్స్క్ వీల్ ట్రాక్టర్ ప్లాంట్.. మిసైల్ ప్రోగ్రాం కోసం వెహికిల్ ఛాసిస్‌లను అందజేసాయని అమెరికా తెలిపింది.
తైవాన్‌కు ఆయుధ సాయం చేశాయన్న కారణంతో అమెరికాకు చెందిన రెండు రక్షణ సంస్థలపై బీజింగ్ ఇటీవల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అది జరిగిన కొన్ని రోజులకే చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడం గమనార్హం