Family Survey : సమగ్ర సర్వేకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం! 33 జిల్లాల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం

by Ramesh N |
Family Survey : సమగ్ర సర్వేకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం! 33 జిల్లాల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: Comprehensive Family Survey in Telangana తెలంగాణ కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సర్వేకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 6 నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 33 జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులకు నేతలు అవగాహన కల్పించే పనిలో ఉన్నారు. ఇవాళ అన్ని జిల్లాలలో డీసీసీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

సర్వే టైమ్‌లో ఎలాంటి ఆటంకాలు రాకుండా, సమగ్రంగా సర్వే జరిగేలా ఏర్పాట్లకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. సర్వేలో పాల్గొని అధికారులకు సహకరించేందుకు, అధికారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమీక్షల్లో పలువురు మంత్రులు తమ సొంత జిల్లా సమావేశాల్లో పాల్గొన్నారు.

Advertisement

Next Story