US Presidential Elections: కొనసాగుతోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. తొలి ఫలితం వెల్లడి!

by Shiva |   ( Updated:2024-11-05 11:27:17.0  )
US Presidential Elections: కొనసాగుతోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. తొలి ఫలితం వెల్లడి!
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికా(America)లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే భారీగా ముందస్తు ఓటింగ్ కూడా నమోదైన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ (Republic Party) అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump), డెమొక్రాటిక్ పార్టీ (Democratic Party) అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (Kamala Harris)ల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. అమెరికా (America) ప్రజలు ఈసారి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

అయితే సర్వే సంస్థలు కూడా ట్రంప్, హారిస్‌ల మధ్య హోరా హోరీ పోటీ ఉందని.. పలు రకాల అంచనాలను వెలురించాయి. ఈ క్రమంలోనే న్యూ హ్యాంప్‌షైర్ (New Hampshire) రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌ (Dixville Notchలో తొలి ఫలితం వెల్లడైంది. అక్కడ మొత్తం ఆరుగురు ఓటర్లు ఉండగా.. కమలా హ్యారిస్‌ (Kamala Harris)కు, డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు మూడు ఓట్ల చొప్పున పోల్ అయ్యాయి. కాగా, న్యూ హ్యాంప్‌షైర్ (New Hampshire) ప్రాంతంలో ఎన్నికల నింబంధన ప్రకారం.. అక్కడ అర్థరాత్రి పోలింగ్ ప్రారంభమైంది. 2020లో డిక్స్‌విల్లె నాచ్ (Dixville Notch) ఓటర్లు జో బైడెన్‌కే జై కొట్టారు.


Read More..

మహిళ అమెరికా ప్రెసిడెంట్‌ అవుతుందా?

Advertisement

Next Story

Most Viewed