Trump: ఎన్నికల హింస కేసులో ట్రంప్ నకు ఊరట

by Shamantha N |
Trump: ఎన్నికల హింస కేసులో ట్రంప్ నకు  ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)నకు భారీ ఊరట లభించింది. ప్రెసిడెంట్ గా రెడీ అవుతున్న టైంలో ఆయనకు సంబంధించిన కేసుల దర్యాప్తును న్యాయమూర్తి నిలిపివేశారు. 2020 నాటి ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన కేసులను ట్రంప్ ని(Trump Election Case) నిందితుడిగా చేర్చారు. కాగా.. ఆ కేసు విచారణను పక్కనబెట్టాలని స్పెషల్‌ కౌన్సిల్‌ జాక్ స్మిత్ కోరారు. అందుకు యూఎస్ డిస్ట్రిక్ జడ్జి తాన్య ఛుట్కాన్ అంగీకారం తెలిపారు. పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న అధికారిక చర్యలపై మాజీ అధ్యక్షులకు ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపును ఇచ్చే అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే కేసు కొనసాగుతుందని స్మిత్ వాదనలు చేశారు. కాగా.. ఆ వాదనపై ట్రంప్ లాయర్లు నవంబర్ 21 లోపు స్పందించాల్సి ఉంది. ప్రాసిక్యూటర్లు ఎలా ముందుకు వెళ్లాలనే ప్రతిపాదనను డిసెంబర్ 2లోగా న్యాయమూర్తికి తెలియజేస్తారని స్మిత్ చెప్పారు.

జస్టిస్ డిపార్ట్ మెంట్ పాలసీ

1970ల నాటి జస్టిస్ డిపార్ట్‌మెంట్ పాలసీ ప్రకారం సిట్టింగ్ ప్రెసిడెంట్ క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు లోబడి ఉండకూడదు. కాగా.. ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ కేసును ఎలా ముగించాలనే దానిపై న్యాయ శాఖ చర్చిస్తోందని న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. ఇకపోతే, ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ ని ట్రంప్ ఓడించారు. దీంతో, అతడిపై ఉన్న రెండు ఫెడరల్ కేసులను ముగించడం ఖాయంగా కన్పిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed